SRCL: రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తామని సిరిసిల్ల సూపరింటెండెంట్ ఇంజనీర్ బిక్షపతి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో ప్రజల వద్దకే విద్యుత్ అధికారులు అనే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిక్షపతి మాట్లాడుతూ.. గతంలో విద్యుత్ వినియోగదారులు రూ. 20వేల నుంచి 60 వేల వరకు ఉన్న ఓఆర్సీ చార్జీలను రద్దు చేశామన్నారు.