SDPT: రైతుల పట్ల బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉండి రైతులను విస్మరించిన కేసీఆర్, నిరసన తెలిపిన అన్నదాతలకు సంకెళ్లు వేయించిన చరిత్రను మర్చిపోయారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వద్ద సరిపడా గన్ని సంచులు ఉన్నాయని, రాజకీయ లబ్ధి కోసమే రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.