HNK: రేపు శాయంపేట మండలంలోని రైతు వేదికలో 11 గంటలకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఫణి చంద్ర తెలిపారు. స్పెషల్ ఆఫీసర్ జగదీశ్వర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుందని, సమావేశానికి మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు సకాలంలో సమావేశానికి హాజరు కావాలని ఎంపీడీవో సూచించారు.