JGL: ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో మంగళవారం భక్తుల రద్దీ కొనసాగింది. ఆలయానికి వచ్చిన ఆదాయం వివరాలను ఈఓ శ్రీనివాస్ వెల్లడించారు. టికెట్ల ద్వారా రూ.1,24,382, ప్రసాదాల ద్వారా రూ.53,560, అన్నదానం ద్వారా రూ.10,400 ఆదాయం లభించింది. మొత్తం రోజువారీ ఆదాయం రూ.1,88,342గా నమోదు అయింది.