NLG: నల్గొండలో సీపీఐ వందేళ్ల వార్షికోత్సవాలు నిర్వహించారు. జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఎర్రజెండాను ఆవిష్కరించారు. శ్రమజీవుల సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల ప్రయోజనాల కోసం సీపీఐ నిరంతరం పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, శ్రవణ్, పబ్బు వీరస్వామి, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.