SRPT: విద్యార్థులు మూఢనమ్మకాలకు దూరంగా ఉండి, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని సీఐ లిక్కి కృష్ణంరాజు పిలుపునిచ్చారు. మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో జేవీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులో ఆయన మాట్లాడారు. ఇటువంటి శిబిరాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తాయని తెలిపారు.