WGL: నర్సంపేటలో దోపిడీ పాలకులకు కమ్యూనిస్టు, సామాజిక శక్తుల ఐక్యతే ప్రత్యామ్నాయమని ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. మే 12న నర్సంపేట సిటిజెన్ క్లబ్లో అమరజీవి మద్దికాయల ఓంకార్ శతజయంతి ముగింపు సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. మొక్కజొన్నకు మద్దతు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు.