MDK: మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన కుమ్మరి శ్రావణ్ కుమార్ ఇవాళ విడుదల చేసిన UPSC ఫలితాల్లో సత్తా చాటాడు. గతంలోనే గ్రూపు -1లో సత్తా చాటి సీటీవోగా విధులు నిర్వహిస్తున్నాడు. అప్పట్లోనే సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నట్టు శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. తాజాగా ఫలితాల్లో ఓబీసీ కోటాలో 768 ర్యాంకు సాధించాడు. దీంతో శ్రవణ్‌ను పలువురు అభినందించారు.