BHPL: చిట్యాల మండల కేంద్రంలో గౌడ సంఘం అధ్యక్షుడు బుర్ర లక్ష్మణ్ ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ తల్లి 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. వారి ఆహ్వానం మేరకు ఈ వేడుకల్లో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, నియోజకవర్గ BJP ఇన్ ఛార్జ్ చందుపట్ల కీర్తిరెడ్డి మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అమ్మవారిని దర్శించుకుని, పూజలు చేశారు.