SRCL: జిల్లాలోని 1-10 తరగతి దివ్యాంగ విద్యార్థుల నుంచి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. 40 శాతానికి పైగా వైకల్యం ఉండి, కుటుంబ వార్షిక ఆదాయం రూ. లక్ష లోపు ఉన్నవారు అర్హులు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 28వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని అనంతరం దరఖాస్తు పత్రాలను కలెక్టరేట్లో సమర్పించాలన్నారు.