ADB: గాదిగూడ మండలంలోని పలు ఆదివాసీ గ్రామాల్లో ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం పర్యటించారు. గ్రామానికి వచ్చిన ఆయనకు సంప్రదాయ డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సహా పంక్తిలో ఆదివాసీలతో కలిసి SP భోజనం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి, గుట్కా, మద్యం, గుడుంబా వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు.