JN: రాష్ట్రస్థాయి సీఎం కప్ క్రీడోత్సవాలకు ఎంపికైన జనగామ జిల్లా క్రీడాకారులకు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ చేతుల మీదుగా టీ షర్టులను గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి వెంకట్ రెడ్డి, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.