BDK: చర్లలో రూ.10.70 కోట్లతో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఈ ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుందని మంత్రి తెలియజేశారు.