GDWL: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మండలంలోని చేనుగోనిపల్లి, అనంతపురం, బసల్చెరువు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తూకం వేసి రైస్ మిల్లులకు తరలించాలన్నారు.