SDPT: చేర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్రం విద్యార్థులు ఈ నెల 19వ తేదీలోగా తమ సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లించాలని కేంద్రం కో ఆర్డినేటర్ రజని తెలిపారు. డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.