SRPT: పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోదాడ రూరల్ పోలీసులు సూచించారు. బుధవారం రాత్రి కోదాడ పట్టణంలోని రామాపురం క్రాస్ రోడ్ వద్ద ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఏఎస్సై మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్, లింక్‌లను నమ్మవద్దని హెచ్చరించారు.