MLG: గోవిందరావుపేట మండల కేంద్రంలో యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పస్రా ఎస్సై తాజుద్దీన్ సూచించారు. మంగళవారం డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలు ఆరోగ్యంతో పాటు కుటుంబ గౌరవాన్ని కూడా దెబ్బతీస్తాయని తెలిపారు. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా చదువు, క్రీడల్లో రాణించాలని సూచించారు.