AP: YCP చీఫ్ జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ కూడా అమరావతి CRDA పరిధిలోనే ఉందని MP కేశినేని చిన్ని అన్నారు. పార్లమెంట్ వేదికగా ఆ పార్టీ నేతలు ఏం చేశారో అందరికీ తెలుసని, ఇప్పటికైనా తమ కుట్రలు మానుకోవాలని హితవు పలికారు. అమరావతిపై YCP కుట్రలను ప్రజలు క్షమించరని, ‘మావిగన్’పై చిన్న పిల్లలు కూడా నవ్వుకుంటున్నారని TDP ఎమ్మెల్యే గౌతు శిరీష విమర్శించారు.