KNR: నగరపాలక సంస్థలో ఖాళీగా ఉన్న కో-ఆప్షన్ సభ్యుల పదవులకు పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉత్సాహం చూపుతున్నారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో మొత్తం 10 మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎన్నికల అధికారులకు సమర్పించారు. గడువు ముగిసే సమయానికి వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించనున్నారు. పాలకవర్గంలో ప్రాతినిధ్యం కోసం వివిధ వర్గాల నుంచి పోటీ నెలకొంది.