NZB: సారంగాపూర్ హనుమాన్ ఆలయం 400 ఏళ్ల చరిత్రకు సాక్ష్యం, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆధ్యాత్మిక గురువు సమర్థ రామదాసు స్వయంగా ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతోంది. శివాజీ మహారాజ్ సైతం ఈ క్షేత్రాన్ని దర్శించి పూజలు నిర్వహించినట్లు ప్రతీతి. కోరిన కోర్కెలు తీర్చే శక్తిమంతుడైన దేవుడిగా పేరుగాంచిన ఈ స్వామినిదర్శించుకునేందుకు భక్తులు వస్తారు.