ఉమ్మడి WGL జిల్లాలోని నెక్కొండ, వేలేరు, బండారుపల్లి, వంగర, హసన్పర్తి, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న సబ్జెక్ట్ అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల సొసైటీ కన్వీనర్ రామారావు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈనెల 31 తేదీలోపు సమీప గురుకులాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారులకు జూన్ 3న డెమో నిర్వహించనున్నారు.