MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులోని గోదావరి రోడ్డు రాంనగర్లో పైప్లైన్ పగలడంతో మిషన్ భగీరథ నీరు వృధాగా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వార్డు ప్రజల కోసం అధికారులు పైప్లైన్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే వార్డులోని ఒక డ్రైనేజీ వద్ద ఐదు రోజులుగా పైప్లైన్ పగిలి నీరు వృధాగా పోతుందని తెలిపారు.