కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అలుగునూరులో వీధి దీపాల మరమ్మతుల సమయంలో విద్యుత్ ప్రమాదానికి గురైన కార్మికుడు సాయువేణి శివకృష్ణకు పూర్తి వైద్య ఖర్చులు మున్సిపల్ శాఖ భరించాలని CITU డిమాండ్ చేసింది. కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తక్షణం స్పందించి DMHOతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేయాలన్నారు.