సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలోని సబ్సిడరీ క్యాంటీన్లో నూతనంగా ఏర్పాటు చేసిన విభాగాన్ని ఎస్పీ నరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్ ధరల కంటే తక్కువకే వస్తువులు అందించడం ద్వారా పోలీస్ కుటుంబాలకు నెలకు రూ. 5,000 వరకు ఆదా అవుతుందన్నారు. సిబ్బంది సంక్షేమం కోసం ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.