HNK: జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం BNRKS వ్యవస్థాపక అధ్యక్షుడు కామల్ల ఐలన్న కుమార్తె వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం నూతన వధూవరులకు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో BNRKS జిల్లా ముఖ్య నాయకులు, తదితరులు ఉన్నారు.