సిద్ధిపేటలో జరిగిన మైనర్ బాలిక వివాహం కలకలం రేపింది. తొగుట మండలానికి చెందిన బాలికకు బుధవారం ఓ ఆలయంలో వివాహం జరిపించారు. అధికారుల తనిఖీలను ముందే పసిగట్టి వేదిక మార్చి పెళ్లి పూర్తి చేశారు. సమాచారం అందుకున్న ఐసీడీఎస్, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు పోలీసులతో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. పెళ్లి కుమారుడు, ఇరుపక్షాల తల్లిదండ్రులు, పూజారిపై కేసు నమోదు చేశారు.