KRNL: ఏపీ మోడల్ స్కూల్ పుటకలమర్రి, ఆస్పరిలో 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసిన విద్యార్థుల హాల్ టికెట్లు విడుదలయ్యాయని ప్రిన్సిపల్ షమీలా ఇవాళ తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 12న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ ప్రింట్‌తో హాజరుకావాలని కోరారు.