NGKL: హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై మూడు రోజులకు ఒకసారి ప్రమాదాలు జరిగి అనేకమంది మరణిస్తున్నారని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ, అచ్చంపేట నియోజకవర్గంలోని మన్ననూర్ లేదా అచ్చంపేట ప్రాంతాలలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు.