నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిలకు మహిళల భద్రతలో చేసిన విశిష్ట సేవలకు జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు కూచాడి శ్రీహరిరావు బుధవారం వారిని ఎస్పీ కార్యాలయంలో సత్కరించి అభినందించారు. ‘నారిశక్తి’ కార్యక్రమం ద్వారా మహిళల రక్షణలో ఆమె చేసిన కృషిని ప్రశంసించారు. వీరి వెంట స్థానిక నాయకులు ఉన్నారు.