SRCL: అకాల వర్షంతో నష్టపోయిన రైతులు అధైర్య పడవద్దు ఆదుకుంటామని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కొనరావుపేట మండలం మర్రిమడ్లలో అకాల వర్షానికి పాడైపోయిన పంటలను ఇవాళ ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. నష్టపోయిన పంటను అంచనా వేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అన్నదాతలు అధైర్య పడవద్దు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.