KMR: పిట్లం మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో గురువారం హనుమాన్ జన్మోత్సవం వేడుకలను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, ఆకు పూజలు హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా భక్తులు సామూహికంగా హనుమాన్ జోల పాడుతూ స్వామివారిని కీర్తించారు.