KNR: ఈనెల 10న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ప్రధాని మోదీ బహిరంగ సభకు తరలిరావాలని కోరుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్లో స్వయంగా గోడపై రాతలు రాసి వినూత్న ప్రచారం చేపట్టారు. వాల్ రైటింగ్ చేసిన ఆయన, కార్యకర్తలంతా గ్రామాలు, వార్డుల్లో ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ నేతలతో సమావేశమై, భారీగా జన సమీకరణ చేయాలన్నారు.