MDCL: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా సాయిప్రియ కాలనీలో ఓ మైనర్ బాలికతో వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక స్టేట్మెంట్ కోసం భరోసా సెంటర్కు తరలించగా, ఆమె వాంగ్మూలం ఆధారంగా నిందితుడిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.