HYD: ప్రజాభవన్లో మంత్రి సీతక్కను సినీనటి మంచు లక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. ‘టీచ్ ఫర్ చేంజ్’ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యా రంగంలో వస్తున్న మార్పులు, చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి లక్ష్మి మంత్రికి వివరించారు. ఈ క్రమంలోనే మార్చి 27న నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని మంత్రిని ఆహ్వానించారు.