NZB: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఎం.ఈడీ మూడో సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 16, 17, 18, 23, 24, 25 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు. విద్యార్థులు పూర్తి టైమ్ టేబుల్ వివరాల కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలన్నారు.