MNCL: మంచిర్యాల జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు మొదటి రోజైనా శనివారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 48 పరీక్షా కేంద్రాల్లో 9689 మంది విద్యార్థులకు గాను 9660 మంది హాజరు కాగా.. 29 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని ఆర్బీహెచ్వీ పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు.