BHPL: నిన్న కాటారం మండలంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మండల కాంగ్రెస్ నేతలు అన్నారు. అనునిత్యం మంథని నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తూ ముందుకు వెళ్తున్న మంత్రి శ్రీధర్ బాబుపై కావాలనే బురద జల్లాలని ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని, BRS నేతల మాయమాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు.