NLG: ఎన్నో ఆశలతో తెల్ల బంగారాన్ని సాగు చేసిన రైతన్నలకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. ఇటీవల కురిసిన వర్షాలు, కూలీల కొరతతో పంటంతా పొలంలోనే మురిగిపోతోంది. ఈ సారి జిల్లా వ్యాప్తంగా 93వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఆలస్యంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, పొంతన లేని నిబంధనలు పెట్టడం వలన పత్తి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు దాపురించాయియని రైతన్నలు వాపోతున్నారు.