KMM : ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన ఘోర ప్రమాదంలో ఖమ్మం నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత మహమ్మద్ జావీద్ ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట పిల్లలమర్రి శివారులో ఆయన ప్రయాణిస్తున్న వాహనం నియంత్రణ కోల్పోయి అతివేగంతో డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు.