NLG: గట్టుప్పల్ కొనుగోలు కేంద్రంలో ట్రాన్స్ఫర్ట్ కొరతతో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని రైతు సంఘం నాయకుడు బండ శ్రీశైలం తెలిపారు. 247 రాసులు ఉండగా, కేవలం 44 మంది రైతులకే కాంటా వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 15 లారీలే ధాన్యం తరలించాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి రవాణా సమస్యను పరిష్కరించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.