SRCL: వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా ఆర్అండ్ఆర్ కాలనీ సర్పంచ్ అభ్యర్థి చర్ల మురళి గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుండెపోటుతో మృతి చెందారు. ఛాతీలో నొప్పి రావడంతో మురళిని కుటుంబ సభ్యులు వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.