RR: కొత్తూరు పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. గూడూరులో తప్పిపోయిన చిన్నారులు చింటూ, బుజ్జిలను గంట వ్యవధిలోనే గుర్తించి వారి తండ్రి రాజుకు సురక్షితంగా అప్పగించారు. కుమ్మరిగూడ పార్క్ సమీపంలో ఆడుకుంటూ దారి తప్పిన ఈ పిల్లలను చేరదీసిన పోలీసులు… వివరాలు అడిగి తెలుసుకుని తండ్రికి అప్పగించారు. పోలీసుల పనితీరుపై స్థానికులు ప్రశంసలు కురిపించారు.