MLG: వెంకటాపూర్ రామప్ప మండలం పాపయ్యపల్లి గ్రామంలో మంగళవారం హనుమాన్ మహా శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచే పూజలు చేసి నగర సంకీర్తనలో పాల్గొన్నారు. జైశ్రీరామ్ నినాదాలతో గ్రామం మారుమోగింది. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. గ్రామ సుభిక్షం కోసం భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.