RR: నాగ్‌పూర్‌లో జరిగిన 69వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో సైబరాబాద్ పోలీసులు అద్భుత ప్రతిభ కనబరిచి 6 పతకాలు (3 స్వర్ణం, 1 రజతం, 2 కాంస్యం) సాధించారు. తెలంగాణ గెలిచిన 12 పతకాల్లో సగం వీటివే కావడం విశేషం. రాష్ట్రం వరుసగా మూడోసారి చార్మినార్ ట్రోఫీ కైవసం చేసుకున్న సందర్భంగా, విజేతలను సైబరాబాద్ సీపీ డా. ఎం.రమేష్ ఘనంగా సత్కరించి అభినందించారు.