MDK: తూప్రాన్ మండలం దాతర్పల్లి శివారులోని గురుకుల పాఠశాల విద్యార్థులకు మంగళవారం కంటి అద్దాలను పంపిణీ చేశారు. పాఠశాలలో నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో దృష్టి లోపాలున్నట్లు గుర్తించిన విద్యార్థులకు ప్రిన్సిపల్ అనురాధ అద్దాలను అందజేశారు. విద్యార్థుల ఆరోగ్యమే తమ ప్రాధాన్యతని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో కంటి వైద్యులు వీరు కుమార్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.