SRPT: హుజూర్ నగర్లో ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పలు కేసుల్లో సీజ్ చేసిన 23 వాహనాలకు మార్చి 5న ఉదయం 10 గంటలకు స్టేషన్ ప్రాంగణంలో వేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్. లక్ష్మా నాయక్ ఒక ప్రకటన లో పేర్కొన్నారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు ఉదయం 9 గంటల నుంచి స్టేషన్లో ముందస్తు దరావత్ రుసుము చెల్లించి నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు.