KMR: ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.15,000 జరిమానా విధించింది. బాధితురాలికి న్యాయం చేసిన పోలీసులను ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. చిన్నారుల జోలికొస్తే చట్టం వదలదని, కఠిన చర్యలు తప్పవని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.