JN: జిల్లాలోని షామీర్పేట్, గోపరాజు పల్లి, ఓబులా కేశవాపూర్, తదితర గ్రామాల్లో నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభల్లో మార్కెట్ కమిటీ ఛైర్మన్ శివరాజ్ యాదవ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజా ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని అన్నారు.