BHNG: శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి నిత్య ఖజానాకు గురువారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్తో రూ.1,18,950, బ్రేక్ దర్శనాలతో రూ.98,400, VIP దర్శనాలతో రూ.1,50,900, ప్రసాద విక్రయాలతో రూ.5,19,010, కార్ పార్కింగ్తో రూ.3,48,500, వ్రతాలతో రూ.83,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.16,17,171 ఆదాయం వచ్చిందన్నారు.