NRML: నిర్మల్‌లోని బోయివాడ గురుద్వారలో వీర్ బాల్ దివస్ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. సిక్కుల పదవ గురువైన గురు గోవింద్ సింగ్ కుమారులు సాహిబ్జాదా జోరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్‌లకు నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వీర్ బాల్ ధైర్యసాహసాలు కొనియాడారు.